పులిని ఎలా బంధించాలో మాకు తెలుసు 

Published on Fri, 10/13/2023 - 01:55

మధిర: అనారోగ్యంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పులి బయటకు వస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నా రని, అయితే ఆ పులిని బంధించి రాష్ట్ర ప్రజలు, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలుసని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.17,700 కోట్ల నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ బంధు, గృహలక్ష్మి, రుణమాఫీ, దళితబంధు వంటి ఏ పథకాన్నీ సంపూర్ణంగా అ మలు చేయని బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఎందుకు ఓటు వేయాలో కేసీఆర్, కేటీఆర్‌ చెప్పా లని భట్టి అన్నారు. బ్యాంకు ఖాతాలో రుణమాఫీ నగదు జమ చేయకుండానే అయినట్లు మెసేజ్‌లు పంపిస్తూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఇలాంటి మోసాల ప్రభుత్వానికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురా వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)