Breaking News

బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు

Published on Sat, 05/11/2024 - 06:13

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్‌ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.

అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?
మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల  బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్‌పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్‌షా, మోదీ మాట్లాడు­తున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్‌ విసిరారు. 

ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాం
తెలంగాణలో కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్‌ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతా­లో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.

ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, 
మందుల సామేలు పాల్గొన్నారు.

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఉండదు
ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ బంద్‌ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న  విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)