Breaking News

అప్పుడు సీఎం స్థానం ఆశించి భంగపడ్డా.. ఆయనకు ఇచ్చారు: ఖర్గే ఆవేదన

Published on Mon, 07/28/2025 - 09:02

బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అధికారం కోసం పరుగు తీయలేదన్నారు. 1990ల్లో తాను కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. తీరా, పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేసుకున్నారు.

కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు దేనికీ తాను ప్రయత్నించలేదని, పార్టీయే అవకాశం ఇచ్చిందన్నారు. నేను ఎప్పుడు పదవుల కోసం పరుగులు తీయలేదు. 1999లో కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్‌.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. పదవులను తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై ఖర్గే స్పందిస్తూ.. ఆయన ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. జగదీప్‌ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వలేదు. రైతులు, పేదలు, అంతర్జాతీయ సమస్యలు, విదేశాంగ విధానంపై విపక్షాలు మాట్లాడితే, వారి స్వరం వినిపించకుండా చేసేవారు అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)