Breaking News

ఒక శకం ముగిసింది.. మన్మోహన్‌పై ఖర్గే ప్రశంసలు

Published on Wed, 04/03/2024 - 09:21

సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్‌ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్‌ను మన్మోహన్‌ సింగ్‌ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. 

ఇక, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్‌ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్‌ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. 

ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. 

మన్మోహన్‌ రాజకీయ ప్రస్థానం..
ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్‌ సింగ్‌ 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్‌ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి  2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్‌ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్‌ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)