కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 01/05/2024 - 18:45

ఎన్టీఆర్‌, సాక్షి: పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. అలాగని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు అని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 

►తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది.. అని అన్నారాయన. 

►ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల  మంది ఉన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. 

►నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు అని కేశినేని నాని వివరించారు. 

►నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడవ సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో  మేం కలిసి పనిచేయలేదు కదా అని కేశినేని నాని అన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)