Breaking News

ఫోన్ ట్యాపింగ్‌లో ఎంతటి వారున్న శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్‌

Published on Tue, 01/20/2026 - 18:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావును సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై హరీష్‌ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ ఏమీ తెలియదు. టెలిగ్రాఫిక్ యాక్టు చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కేటీఆర్‌కు  తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు. నా ఫోన్, షబ్బీర్ అలీ ఫోన్‌ సహా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలు విన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. మహిళా యాక్టర​్‌ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూశారు. తప్పు చేశారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ వేధింపులు కానే కాదు, వేధింపులకు పాల్పడాలంటే రెండేళ్ల వరకు ఎందుకు వేచి చూస్తాం. అప్పుడే జైలుకు పంపే వాళ్లం అని వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ..‘గతంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని నన్ను కూడా విచారణకు పిలిచారు. నా కుటుంబ సభ్యులు, మా ఇంటి వాచ్‌మెన్‌ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్‌ఎస్‌ హయంలో నాపైనే అధికంగా కేసులు పెట్టారు. గాంధీభవన్‌ లోపలికి వచ్చి మరీ అరెస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)