Breaking News

తోకముడిచిన మహాసేన రాజేష్‌.. బరి నుంచి ఔట్‌

Published on Sat, 03/02/2024 - 15:27

సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ-జనసేన అభ్యర్థి సరిపెళ్ల రాజేష్‌(మహాసేన రాజేష్) తోకముడిచారు. పి.గన్నవరం ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. పి. గన్నవరం నియోజకవర్గానికి రాజేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మహాసేన రాజేష్‌ను బరి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేటలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు రచ్ఛ రచ్చ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జ్ హరీష్ మాధుర్ కారును కూడా జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించి తప్పుకుంటున్నట్టు  రాజేష్‌ ప్రకటించారు.

మరోవైపు వివాదాస్పదుడైన మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్‌ను కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేష్‌కు టికెట్‌ ఇవ్వడం అంటే బ్రాహ్మణులను టీడీపీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. మహాసేన రాజేష్‌కు టీడీపీ ఇచ్చిన పి.గన్నవరం టికెట్‌ను వెంటనే రద్దు చేయాలని కర్నూలులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్‌ చేసింది.  

కాగా, మరో వైపు, రాజేష్‌కు టికెట్‌ ఇచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలు హిందూ సంఘాల హెచ్చరిస్తున్నాయి. హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌పై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాజేష్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశాయి. రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోకవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)