Breaking News

మహారాష్ట్ర బీజేపీ కూటమిలో మొదలైన సీట్ల పంచాయితీ!

Published on Sat, 07/27/2024 - 07:45

ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉ‍న్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.

బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌  ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో  పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన  ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్‌ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా..  బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ  ఎన్ని‍కల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల  విభజనపై  కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి  వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతు​న్నట్లు వస్తున్న​ వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం  కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి  దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)