Breaking News

మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి

Published on Tue, 06/04/2024 - 13:23

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా తగ్గింది. అయోధ్య రామనాయం పనిచేయనట్లు కనిపిస్తుంది.  2019 ఫలితాలో పోలిస్తే తాజాగా బీజేపీ గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌, మహారాష్ట్రలో గతం కంటే సగం సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ.

చాలా చోట్ల ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎన్డీయే వెనుకంజలో ఉంది.  

మొత్తం 48 స్థానాల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ 12 చోట్ల, శివసేన(షిండే వర్గం) ఆరు చోట్ల, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) ఒకచోట ఆధిక్యతలో ఉంది. కేంద్ర మంత్రులు  నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌ ముందంజలో ఉన్నారు. 

మరోవైపు మహా వికాస్‌ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన  శివసేన(ఉద్దవ్‌ వర్గం) 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 10 సీట్లలో, ఎన్సీపీ(శరద్‌ పవార్‌) ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి సాంగ్లీ నుంచి పోటీ చేసిన  స్వతంత్ర అభ్యర్థి విశాల్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తానికి ఎన్డీయే కూటమి 19 చోట్ల, ఇండియా కూటమి 28 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా 48 లోక్‌సభ స్థానాలతో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అయిదు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 61 శాతం పోలింగ్‌ నమోదైంది.  ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్డీయే 30 స్థానాలు గెలుచుకుంటుందని, ఇండియా 18 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వాస్తవ ఫలితాలు తారుమారు చేశాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)