Breaking News

డ్రైవర్‌ సీటు కోసం కాంగ్రెస్‌ కూటమిలో కొట్లాట: మోదీ విమర్శలు

Published on Fri, 11/08/2024 - 15:07

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచార స్పీడ్‌ను పెంచాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. డ్రైవర్‌ సీటు కోసం మహా వికాస్‌ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంవీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై ఉన్న అంతర్గత పోరును ఉద్ధేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ‍ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి అధికారంలో  రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదనే మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదని అన్నారు.

ఇక జమ్మూకశ్మీర్‌  అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోదీ  స్ప ష్టం చేశారు.

ఆర్టికల్ 370 రగడ.. కాంగ్రెస్ కు మోదీ వార్నింగ్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)