Breaking News

స్వాతి? సుజాత?.. సర్పంచ్‌ ఎవరో??

Published on Mon, 12/22/2025 - 12:06

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 

వివరాలు ఇలా..  మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.

ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్‌ఎస్‌కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)