Breaking News

యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌

Published on Mon, 07/14/2025 - 21:37

న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వైఫల్యమేనని  ఆ రాష్ట్ర సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్‌ ఉగ్రదాడికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కారణమన్నారు.

కాగా, జమ్ముకశ్మీర్‌ సీఎం  ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. 

దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్‌ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14)  ఒమర్‌ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. 

దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.  జమ్మూ కశ్మీర్‌లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్‌ సింధూర్‌ వరకూ భారత్‌ వెళ్లడానికి ఎల్జీ మనోజ్‌ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)