Breaking News

బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు: అమిత్‌ షా

Published on Wed, 09/11/2024 - 14:28

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా వేదికగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలను తప్పికొడుతున్నారు. తాజాగా రాహుల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. 

దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్‌ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. 

అది జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్‌ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్‌కు, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. 

ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో  బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)