Breaking News

ఇండియా కూటమికి డబుల్ షాక్!

Published on Wed, 01/24/2024 - 15:45

చంఢీగర్‌: ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది.  పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

ఇదీ చదవండి: ఒంటరిగానే పోటీ.. ఇండియా కూటమికి సీఎం మమత షాక్‌

ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్‌ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బెంగాల్‌ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. 

ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు  కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్‌లో ఒంటరిగానే పోరాడతాం.  ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.

ఇదీ చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్‌ గాంధీ

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)