Breaking News

Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు

Published on Fri, 04/12/2024 - 06:08

జైపూర్‌: తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు ఎంత మొత్తుకున్నా బాధలను మోదీ సర్కార్‌ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అనూప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ తమ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు. ఉపాధి కల్పించాలని నిరుద్యోగ యువత విన్నపాలు చేస్తోంది.

నిత్యా వసరాల ధరల నుంచి ఉపశ మనం కల్పించాలని మహి ళలు వేడుకుంటున్నా వీళ్ల గోడు ఎవరికీ పట్టదు’’ అని రాహుల్‌ అన్నారు. ‘‘  వెనుకబడిన వర్గా లు, దళితులు, గిరిజనులు, జనరల్‌ కేటగిరీలో ఉన్న పేదల అభ్యున్నతి కోసమే ఈ ఎన్నికలు. నిరుద్యోగమే దేశంలో అతిపెద్ద సమస్య. ద్రవ్యోల్బణం రెండో సమస్య.

దేశంలో 90 శాతం మంది ఇవే చెబుతారు. కానీ ఒకవేళ కేంద్రంలో బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న జాతీయమీడియాను ఫాలో అయితే మాత్రం మనకు అంబానీ కుమారుల పెళ్లివేడుకే దేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మోదీ ఓసారి సాగరగర్భంలోకి వెళ్తారు, మరోసారి గస్తీవిమానంలో చక్కర్లు కొడతారు, మరోసారి డప్పు వాయిస్తూ కనిపిస్తారు, ఇంకోసారి సభలో మొబైల్‌ ఫ్లాష్‌లైట్లు వెలిగించాలని పిలుపునిస్తూ కనిపిస్తారు. జాతీయ మీడియాలో 24 గంటలూ మోదీ ముఖమే దర్శనమిస్తుంది’’ అని ఎద్దేవాచేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)