Breaking News

కాంగ్రెస్‌ తోక పార్టీలా బీఆర్‌ఎస్‌ 

Published on Mon, 07/31/2023 - 01:29

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ తోక పార్టీలా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా వారి బంధం ఉందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌కు ఆప్‌తో కూడా అవినాభావం సంబంధం మరింతగా బలపడుతోందని ఆరోపించారు. తెలంగాణలో భారీ వర్షాలకు నగరాలు మునిగిపోయినా, జనజీవ నం స్తంభించిపోయినా సీఎం కేసీఆర్‌కు ఏమీ పట్టలేదనీ, రోమ్‌ చక్రవర్తిలా వ్యవహరిస్తూ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని నిందించారు.

మును పెన్నడూ లేని విధంగా వరంగల్, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్‌లు ఒ‘కే సారి జలమయం అయ్యాయని, తెలంగాణకు సముద్రం లేని లోటు తీర్చడం బీఆర్‌ఎస్‌కే దక్కిందని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నదులకు నడక నేర్పడం సంగతి ఏమోగానీ ఢిల్లీ వరకూ మద్యం ప్రవహించేలా ఘనత మాత్రం ఆయన కుటుంబానికే చెల్లిందని ఆరోపించారు. మద్యం ద్వారా పెరిగిన బంధంతోనే సంజయ్‌ సింగ్‌కు వత్తాసు పలుకుతున్నారని నిందించారు.  

కేంద్రబృందాల అంచనా రాగానే సాయం 
వర్షాల వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం హోంమంత్రి అమిత్‌షాను కలిసి వివరించిందని లక్ష్మణ్‌ తెలిపారు. కేంద్ర బృందాల నష్ట అంచనా రాగానే కేంద్రం నుంచి సహాయం ఉంటుందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష మార్పు, బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్‌ వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)