Breaking News

లఖీమ్‌పూర్‌ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు 

Published on Tue, 10/05/2021 - 04:28

సీతాపూర్‌ (యూపీ): వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరిలో జరిగిన రైతు ఆందోళన.. తదనంతరం చెలరేగిన హింస రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోమవారం విపక్ష రాజకీయ నాయకులు, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లఖీమ్‌పూర్‌ వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా యూపీ సర్కార్‌ చర్యలకు దిగింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖీమ్‌పూర్‌ ఖేరికి బయల్దేరగా మార్గం మధ్యలో సీతాపూర్‌ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ పీఏసీ గెస్ట్‌ హౌస్‌లో ప్రియాంక నిరాహార దీక్షకు దిగారు. తొలుత లక్నోలోనే ఆమెని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ ఆమె ఎలాగోలా రైతుల దగ్గరకు చేరాలని బయల్దేరగా సోమవారం తెల్లవారుజామునే అదుపులోనికి తీసుకున్నారు.  తమ కార్లను అడ్డగించి తాళాలు తీసుకొని నిర్భంధించారని ప్రియాంక మీడియాకు చెప్పారు. పోలీసులు తనని అదుపులోనికి తీసుకొని ఉంచిన అతిథి గృహంలో ప్రియాంక చీపురుతో గది ఊడుస్తున్న వీడియోను యూపీ కాంగ్రెస్‌ నేత వికాస్‌ శ్రీవాస్తవ విడుదల చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో రైతులే గెలుస్తారని వ్యాఖ్యానించారు.  ‘‘ప్రియాంక నాకు తెలుసు నువ్వు వెనుకడుగు వెయ్యవు. ప్రభుత్వం నీ ధైర్యం చూసి భయపడుతోంది’’అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు లఖీమ్‌పూర్‌ ఖేరికి పర్యటనకు పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ , ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంధ్వా, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భఘేల్‌లకు యూపీ సర్కార్‌ అనుమతి నిరాకరించింది.

యూపీ, హరియాణా సరిహద్దుల్లో రాంధ్వా, ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు  రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.  రాజకీయ నేతల విమానాలేవీ లక్నోలో ల్యాండ్‌ కానివ్వొద్దంటూ యూపీ సర్కార్‌ లక్నో ఎయిర్‌పోర్టు అథారిటీకి విజ్ఞప్తి చేసింది. మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు.

యూపీలో హంతక రాజ్యం: మమత
లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో నిరంకుశ పాలన, ఉత్తర ప్రదేశ్‌లో  రామరాజ్యం బదులు హంతక రాజ్యం నడుస్తోందన్నారు. ‘‘దేశంలో ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పాలన. రైతులను దారుణంగా చంపేస్తున్నారు. నిజాలను బయటకు రాకుండా చేస్తున్నారు. అందుకే లఖిం పూర్‌ఖేరిలో 144వ సెక్షన్‌ అమలు చేస్తు న్నారు. దేశ ప్రజలే బీజేపీపై 144వ సెక్షన్‌ విధించే రోజు  త్వరలో రానుంది’’అని సీఎం మమతాబెనర్జీ సోమవారం భవానీపూర్‌లో మీడియాతో అన్నారు.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)