Breaking News

కూటమిలో కుమ్ములాటలు

Published on Fri, 11/06/2026 - 09:01

డాబాగార్డెన్స్‌ : విశాఖ కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. టీడీపీ దక్షిణ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌పై జనసేన, బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు అన్యాయం చేశారంటూ ఆయనను పార్టీ నుంచి, కూటమి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రెండో సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్‌ సాధిక్, 39వ వార్డు బీజేపీ అభ్యర్థి దామోదర్‌ యాదవ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు.  ఈ సందర్భంగా దామోదర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తాను బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా 39వ వార్డు నుంచి పోటీ చేశానన్నారు. కూటమి పెద్దలతో చర్చించిన అనంతరం దక్షిణ జోన్‌లో బీజేపీకి కేటాయించిన ఏకైక సీటు తనకు ఇచ్చారని తెలిపారు. అయితే టీడీపీ సౌత్‌ ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌ తనకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌ 

అభ్యర్థిని నిలబెట్టి, ఆయనకు సహకరించారని ఆరోపించారు. కూటమి అభ్యరి్థకి సహకరించాల్సిన సమయంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయానికి ప్రయతి్నంచడం ద్వారా కూటమిలో విభేదాలు సృష్టించారని విమర్శించారు. బీజేపీని కానీ, ఆ పార్టీ అభ్యర్థులను కానీ అవమానిస్తే సహించేది లేదని, సీతంరాజు సుధాకర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్‌ సాధిక్‌ మాట్లాడుతూ.. గతంలో కార్పొరేటర్‌గా ఐదేళ్లు సేవలందించానని, ఈసారి మహిళా రిజర్వేషన్‌ కారణంగా తన సతీమణిని బరిలో నిలిపానన్నారు.

 తన అనుచరులకు టికెట్లు రాలేదనే కారణంతో సీతంరాజు సుధాకర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించి కూటమి అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.టీడీపీ పోటీ చేసిన వార్డుల్లో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించారని, కానీ జనసేన, బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో ఇండిపెండెంట్లకు సహకరించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీనిపై కూటమి నాయకత్వం స్పందించాలని కోరారు.  

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)