Breaking News

నా వద్దే టోల్ వసూలు చేస్తారా? రెచ్చిపోయిన టీడీపీ నేత

Published on Thu, 08/28/2025 - 19:53

సాక్షి, కర్నూలు: అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నందవరం మండలం హాలహర్వి (NH 167) టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి దాడికి దిగారు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్‌ గేట్‌ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత.. దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.

కాగా, శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై గూండాగిరి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీకి చెందిన మండల పరిషత్‌ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్‌ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం(ఆగస్టు 27) చిలమత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్‌ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించారు.

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)