Breaking News

‘కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా?’

Published on Mon, 04/17/2023 - 08:44

సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై  హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.

'వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది.  నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి?

మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)