Breaking News

తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌

Published on Mon, 12/16/2024 - 08:37

సాక్షి,తెలంగాణ భవన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.  

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని, కేసీఆర్‌ రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ’ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ఖండిస్తున్నారు. అప్పుల అంశంపై సోమవారం కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

‘ రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం. ఆర్‌బీఐ  నివేదిక ప్రకారం అప్పు రూ. 3.89 లక్షలు మాత్రమే అని పేర్కొంది. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం ‘ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదిక తేల్చిందని అన్నారు.

ఆర్థిక మంత్రి భట్టి అప్పు లపై చేసిన ప్రసంగాన్ని ఖండించిన కేటీఆర్...

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు.  కావున తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు  సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’ అని ట్విట్‌లో పేర్కన్నారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)