Breaking News

రేవంత్‌.. ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయ్‌: కేటీఆర్‌

Published on Thu, 04/17/2025 - 11:19

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. 

మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం తలకెక్కి, అధికార మదంతో విర్రవీగి చక్రవర్తులం అని  భావిస్తే.. న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో  సీఎం రాజీనామా చేసి పోవాలి.  కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై  సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల, అధ్యాపకుల, సపోర్ట్ చేసిన  అందరి విజయం’ అని చెప్పుకొచ్చారు. 

ఆర్‌ఆర్‌ టాక్స్  అని , హెచ్‌సీయూలో  ఏదో జరుగుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం కాదు. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జీతో ఇన్వెస్టిగేషన్  చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో  విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ, ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాటపడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంట నక్కలు అని డైలాగ్‌ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్ట్ వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచాలు లెక్కబెట్టాల్సి వస్తుంది. సుప్రీంతీర్పును స్వాగతిస్తున్నాము. రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు రేవంత్. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు.

రెండు  జాతీయ  పార్టీలు  ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే  తిరగబడి బాంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ  ఐదేళ్లు సీఎంగా ఉండాలి ఆ తర్వాత  వచ్చే 20ఏళ్ళు  కాంగ్రెస్‌కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)