Breaking News

TS:అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్‌

Published on Wed, 12/13/2023 - 12:54

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌​, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు అంశాలపై స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని వల్లె వేయిస్తారు’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

‘ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే  ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

ఇదీచదవండి..హైదరాబాద్‌ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి: డ్రగ్స్‌పై వారికి వార్నింగ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)