Breaking News

బడే భాయ్‌.. చోటే భాయ్‌ ఇద్దరూ ఒక్కటే!

Published on Fri, 03/21/2025 - 05:44

సూర్యాపేట: కేంద్రంలో బడేభాయ్‌ మోదీ, రాష్ట్రంలో చోటే భాయ్‌ రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, రేవంత్‌ అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు.

ఏప్రిల్‌ 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్‌ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

రేవంత్‌కు పర్సంటేజీలపైనే దృష్టి 
చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్‌ పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. రైతులకు రావాల్సిన రూ.37 వేల కోట్లు ఢిల్లీలో ఉన్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఖాతాల్లో టింగు టింగు అంటూ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని చెప్పారు.

చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది.. అలాగే కాంగ్రెస్‌ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్‌ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. సమావేశానికి ముందు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)