Breaking News

‘పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్!‘..కేటీఆర్‌ కౌంటర్‌

Published on Thu, 07/25/2024 - 17:29

సాక్షి,హైదరాబాద్‌ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా కౌంటర్ ఇచ్చారు.  

తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 

 అయితే ఈ బడ్జెట్‌పై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్‌లో కేటీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు  భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! 

మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్‌లో తెలిపారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)