Breaking News

బీఆర్‌ఎస్‌లో జోష్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర

Published on Fri, 11/01/2024 - 12:27

సాక్షి,హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎక్స్‌ వేదికగా నిర్వహించే ‘ఆస్క్‌ కేటీఆర్‌’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా పాదయాత్రపై కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్‌లో పాదయాత్ర చేస్తా.  రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృతంగా పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు శాపం. కాంగ్రెస్‌ పాలనలో నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని కేటీఆర్‌ తెలిపారు.   

కేసీఆర్‌ వ్యూహాలతో కేటీఆర్‌ పాదయాత్ర
ఎన్నికల్లో పరాజయం. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం.రోజురోజుకి పార్టీ బలహీన పడుతుండడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌ ఆ హామీల్ని నిలబెట్టుకోలేదని, దాంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేస్తున్న కేసీఆర్‌ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.దీనికి సంబంధించి  ఆయన ఈ మధ్యనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీనేతలు చెప్పుకుంటున్నారు.

పార్టీని ఉద్యమ పార్టీగా మలచి,ప్రజల అభిమానం గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్‌ తిరిగి పార్టీని బలోపేతం చేయడం కోసం పాదయాత్రకి ప్రణాళిక సిద్ధం చేశారట. ఇందులో భాగంగా కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను తెలుసుకుని అధికార పార్టీని నిలదీస్తారని ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో నేతలు వ్యవహరించాల్సిన తీరును ఇప్పటికే వివరించారని, త్వరలోనే కేటీఆర్‌ పాదయాత్ర చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ ప్రకటనతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. 

తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)