Breaking News

రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 01/24/2024 - 16:47

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్‌నాథ్‌ షిండే  రేవంత్‌రెడ్డినే అవ్వొచ్చని అ​న్నారు. తెలంగాణ ప్రజలు మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్‌ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని తెలిపారు. ఆయన బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్‌పై గెల్చిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజులు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని  ధైర్యం చెప్పారు.

గతంలో కరీంనగర్ పార్లమెంట్‌లో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పారు.

రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. దాన్నే తాను చెప్పుకొచ్చానని అన్నారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో? అని కేటీఆర్‌ మండిపడ్డారు.

రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా అని రేవంత్‌రెడ్డి దావోస్‌లో చెప్పారని విర్శించారు. మరి రైతుబంధు వచ్చిందా? అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు పడలేదంటే మంత్రి ​కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు.

చదవండి: ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు!

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)