Breaking News

ఐటీ నేపథ్యం ఎప్పటికీ నాకు గర్వకారణం

Published on Fri, 01/24/2025 - 05:26

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తనను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌(KTR) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ‘ఎక్స్‌’వేదికగా స్పందించారు. ‘నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడవచ్చని అనుకునేవాళ్లకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి జీవనోపాధిని పొందుతున్నారు.

ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలు, నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్‌ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్లు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)