Breaking News

తొలిసారే ఈ గడ్డు పరిస్థితులు.. కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 10/17/2024 - 15:31

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునున్నామని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసింది.పార్టీ పెట్టిన తర్వాత మెదటిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి పదవినికి కాపాడుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేస్తోంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉద్దండులతోనే మన పార్టీ కొట్లాడింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో నష్టం చేస్తున్నారు. తమకు అండగా నిలవాలని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారు.తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు.

రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోంది.నవంబర్ 5న జరిగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తాం. కాంగ్రెస్‌ పాలనలో భాదపడని వారు లేరు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయి. హరీష్ రావు కుట్రతోనే నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని  రేవంత్‌ రెడ్డి అనుకున్నారు.  

తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడదు?కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారు. బీఆర్‌ఎస్‌  కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ప్రత్యుర్థులే  డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి‌‌. అందరికి అవకాశాలు వస్తాయి’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)