Breaking News

బీసీ డిక్లరేషన్‌ హామీలు ఎటు పోయాయి?: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published on Sun, 11/10/2024 - 15:46

సాక్షి, హన్మకొండ: బీసీ డిక్లరేషన్‌ హామీలు ఏమయ్యాయి?ఎటు పోయాయి? అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిలదీశారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడుతూ.. ఏడాది కింద ఇదే రోజు కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్‌ పేరిట చాలా వాగ్ధానాలు ఇచ్చారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్న పథకాలు తీసేసింది.’’ అని మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ బంధుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాతర వేసింది. కుల గణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతుంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. అడ్డమైనా హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌  చేశారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీసీ ఓట్ల కోసం.. కులగణనతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. ప్రజలకు ఇచ్చిన  ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్‌తో  కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది. మహారాష్ట్రలో  సీఎం రేవంత్ తెలంగాణకు 500 బోనస్ ఇచ్చామంటూ బోగస్ మాటలు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడదాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

ఇదీ చదవండి: ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా!

Videos

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)