Breaking News

జాక్‌పాట్‌ సీఎంకు ఉద్యమ చరిత్ర తెలియదు

Published on Mon, 06/03/2024 - 03:28

సాక్షి, హైదరాబాద్‌:   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అనలేని మూర్ఖుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మండిపడ్డారు. 

శుభాకాంక్షల సందేశంలోనూ జై తెలంగాణ అనలేదని, జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమ చరిత్ర తెలియదని అన్నారు. తె లంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.  

ప్రజల ఆకాంక్షకు పురుడు పోసింది కేసీఆర్‌ 
‘సీఎం రేవంత్‌ మూర్ఖుడు.. దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటే నెల రోజుల పాటు సంబురాలు నిర్వహించే వాళ్లం. మలిదశ ఉద్యమంతో 2001లో టీఆర్‌ఎస్‌తో కొత్త విప్లవాన్ని çసృష్టించి చరిత్రను మలుపు తిప్పి తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్‌ పురుడు పోశారు. ఆధునిక భారత దేశం కళ్లారా చూసిన మరో స్వాతంత్య్ర పోరాటం తెలంగాణ ఉద్యమం. 

సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం మనది. అమరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పుకున్న ఘనకీర్తి తెలంగాణ సొంతం. తెలంగాణ మరింతగా అభివృద్ది చెంది దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా.. ’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ఘనంగా వేడుకలు 
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు అమరులకు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగురవేశారు.

తర్వాత ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ యాది’ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ అమరుడు కానిస్టేబుల్‌ కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించారు. ఉద్యమ ఘట్టాలతో పాటు పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో గ్యాలరీని కేటీఆర్‌ నేతలతో కలిసి సందర్శించారు.  

అమరులకు నివాళులర్పించిన కేసీఆర్‌ 
బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 11.30కు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు గులాబీలతో స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్‌ అమరులకు నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో గంట 20 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. 

రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను మననం చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే పంథాను వివరించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆట పాటలతో హోరెత్తించారు. సమావేశం ముగిసిన తర్వాత కళింగ భవన్‌లో కేటీఆర్‌ నేతలతో కలసి భోజనం చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)