Breaking News

కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చిన మంత్రి

Published on Fri, 06/30/2023 - 19:29

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ  పాల్గొన్నారు.

అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్‌తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఎమ్మెల్యే చేయిని మంత్రి తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్‌గా షాక్‌ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.

ఇక పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. అయితే పట్టణంలో పర్యటించిన కేటీఆర్‌కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
చదవండి: ‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)