Breaking News

‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్‌

Published on Fri, 05/16/2025 - 13:30

సాక్షి,హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం  ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్.  

అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు.  ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది.  

ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు.  ఇదే అంశంపై రాహుల్‌ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్‌ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)