Breaking News

మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌..

Published on Mon, 08/21/2023 - 19:06

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావుపై ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్‌ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు.

‘తన కుటుంబ సభ్యునికి టికెట్‌ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్‌ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్‌ రావు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు.

అదే విధంగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.‘తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత,BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’ అని ట్వీట్‌ చేశారు.
చదవండి: మంత్రి హరీష్ రావుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్‌

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున టికెట్‌ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అదే విధంగా సిరిసిల్ల అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.  ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని టికెట్‌ లభించని వారిని ఉద్ధేశిస్తూ పేర్కొన్నారు.

చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ నుంచి  టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది’  అని కేటీఆర్ అన్నారు.

కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
చదవండి: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)