Breaking News

అసెంబ్లీలో రేవంత్‌ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్‌

Published on Sun, 12/08/2024 - 18:56

సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్‌ హెచ్చరించారు.

‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్‌ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)