Breaking News

మోదీ పిట్ట బెదిరింపులకు భయపడం

Published on Sun, 07/09/2023 - 02:43

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసగించారని.. ఎన్నోఏళ్ల కల అయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టి, చిన్న వ్యాగన్‌ రిపేర్‌ షాప్‌కు శంకుస్థాపన చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిపెట్టాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి ఉడత ఊపులు, పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణ ప్రజలు 45ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ ఎగనామం పెట్టారు. రూ.20వేల కోట్ల విలువైన ఫ్యాక్టరీని తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు మోసపూరితంగా తరలించుకుపోయారు. సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌ అనే నినాదం గుజరాత్‌కా సాత్, గుజరాత్‌కా వికాస్‌గా మారిపోయింది.

తెలంగాణ గత తొమ్మిదేళ్లలో కోరిన దేన్నీ కేంద్రం మంజూరు చేయలేదు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పా టు, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునః ప్రారంభంతోపాటు జాతీయ రహదారి ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్లు, ఉన్న రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టారు.

మోదీవన్నీ అసత్యాలే..
ప్రధాని పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగింది. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం పరిపాటైంది.

దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పెంచిన ప్రధాని మోదీని ఉద్యోగాలపై ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న సుమారు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడటం గురవింద గింజ సామెత కన్నా హీనంగా ఉంది.

అన్ని వర్గాలకూ అన్యాయమే..
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని గతంలో బీజేపీ నేత, ప్రస్తుత గవర్నర్‌ తమిళిసై తొక్కిపెట్టిన విషయంపై ప్రధాని స్పందించకుండా ఖాళీల గురించి మాట్లాడారు. సెంట్రల్‌ యూనివర్సిటీల ఖాళీలు ప్రధానికి కనిపించలేదా? తెలంగాణ ప్రభుత్వ బడుల  వ్యవస్థ గురించి అసత్యాలు మాట్లాడారు.

వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల మరణాలకు కారణమైన ప్రధాని ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం గురించి ప్రస్తావించిన ప్రధానికి.. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇవ్వాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తొక్కిపెట్టిన విషయం తెలియదా?

కుటుంబపాలన అంటే నవ్వుతారు
ప్రధాని మోదీ కుటుంబ పాలన గురించి మాట్లాడటం దారుణం. అనేక రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల నుంచి తన కేబినెట్లో మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారేనన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది..’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)