ఎన్ని శక్తులు ఏకమైనా గెలుపు వైఎస్సార్‌సీపీదే

Published on Fri, 02/23/2024 - 05:14

సాక్షి, అమరావతి: ఎన్ని శక్తులు ఏకమైనా 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగనే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని వర్గాలూ వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. ‘సిద్ధం’ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తే.. సీఎం జగన్‌పై ప్రజలకు ఏస్థాయిలో అభిమానముందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరోక్షంగా చెప్పేశారు.

చంద్రబాబు కుప్పంలో ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తెలిసే.. బాబుకు ఇక విశ్రాంతి అవసరమంటూ భువనేశ్వరి అన్నారు. నారా కుటుంబం ఓటమిని ముందే అంగీకరించింది. కుప్పంలో సైతం ఓడిపోతానని తెలిసే.. అక్కడి నుంచి పారిపోయేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు.

ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేనప్పుడు.. రాజకీయాలు ఎందుకు? అసలు ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు, బీజేపీకి, పవన్‌కు ఓటు వేయాలి? 2014లో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయకుండా చంద్రబాబు కూటమి ప్రజల్ని మోసం చేస్తే.. సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో కులమతాలు,

పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ సీఎం జగన్‌ మంచి చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే వైఎస్సార్‌సీపీ టార్గెట్‌. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మళ్లీ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)