Breaking News

రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది: కొమ్మినేని

Published on Thu, 08/10/2023 - 12:31

సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీలో హింసా రాజకీయాలు నివారణా చర్యలు - మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

‘‘చంద్రబాబు లోకేష్ తమ మీటింగుల ద్వారా  టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక జిల్లా ఎస్పీ పేరు రెడ్ బుక్‌లో రాసుకుని ఆయనను ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటికి దెబ్బ తగిలితే ఈనాడు మొదటి పేజీలో వేసింది.. చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. పుంగనూరులో ఒక కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోతే ఈనాడు, చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం’’ అని కొమ్మినేని పేర్కొన్నారు.

‘‘పుంగనూరు ఘర్షణలో ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయొద్దని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశించారు. లేదంటే పోలీసులు ఫైర్ చేసేవాళ్లు.. టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయి ఉండేవారు. దెబ్బలు తిన్న పోలీసులపై సానుభూతి కాకుండా వాళ్లే తప్పు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ కొమ్మినేని తప్పుబట్టారు.
చదవండి: మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్‌ మళ్లీ ఏసేశాడు 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)