Breaking News

కేసీఆర్‌ మాటలన్నీ అబద్ధాలే 

Published on Mon, 09/18/2023 - 02:30

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పథకాల విషయంలో కేసీఆర్‌ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ‘‘రైతుబంధు అందరికీ ఇవ్వలేదు.. 24 గంటల కరెంటు అంతా ఉత్తిమాటే.. అందరికీ ఇళ్లు కూడా వట్టిమాటలే.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేశారు.

ఇక ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్‌ కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే కేసీఆర్‌ దుకాణం బంద్‌ అయింది. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం, ఉద్యోగ అర్హత పరీక్షల పేపర్లు లీక్‌ చేసే ప్రభుత్వం ఉంది. ఈ కుంభకోణాల ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఇందుకోసం కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది..’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు కావస్తోందని గుర్తు చేశారు.

2014లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి స్వాతంత్య్రం ఇస్తే.. ఇప్పుడు కేసీఆర్‌ అవినీతి పాలననుంచి విముక్తి కల్పించేందుకు మరోసారి తెలంగాణ గడ్డకు వచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని.. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వంద సీట్లలో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)