Breaking News

బీఆర్‌ఎస్‌కు నేను చాలు..

Published on Wed, 07/31/2024 - 04:44

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని, బీఆర్‌ఎస్‌కు తాను చాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ముగ్గురూ కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారని, ఆయనకు వాళ్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడకూ వెళ్లడని, చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పారీ్టలో చేరినట్టా అని అన్నారు.

మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి విలేకరులతో చిట్‌చాట్‌ మాట్లాడారు. కేటీఆర్‌ కూడా తన చైర్‌ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు అవుతుందా అని చెప్పారు. ‘కేసీఆర్‌ సభకు ఎందుకు రావడంలేదు. సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్షనేత కూడా అలాగే.. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే.

ఆయన వైఖరి చూస్తోంటే త్వరలోనే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది’అని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలను జగదీశ్‌రెడ్డి అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీఆర్‌ఎస్‌ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌కు త్వరలోనే రీటెండర్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)