Breaking News

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Fri, 10/27/2023 - 10:03

సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని.. బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెస్‌లో చేరినా ఆయనను గద్దె దించేందుకేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

‘‘సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

కాగా, తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు మరికాసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరనున్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ను కాపాడుతోంది బీజేపీనే

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)