Breaking News

కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Published on Fri, 10/27/2023 - 06:34

సాక్షి, ఢిల్లీ: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌లు  పాల్గొన్నారు. 

వాస్తవానికి ఇవాళ(శుక్రవారం) కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం నడిచింది. అయితే.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావిడిగా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.  


మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరునున్నారు.  

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, పైగా కేసీఆర్‌ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ.. అందుకే  తాను తిరిగి కాంగ్రెస్‌ గూటికి వెళ్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. తాను మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని.. అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానంటూ ఆయన అంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)