Breaking News

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి

Published on Tue, 07/11/2023 - 12:48

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దన్న రేవంత్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇచ్చి తీరుతామని, తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

‘‘చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడు. వైఎస్సార్‌ ప్రతిపక్ష నేతగా 24 గంటలు ఇస్తానని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి అప్పట్లో చంద్రబాబు రైతులను కాల్చి చంపారు. రైతులకు అండగా నిలిచి వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇచ్చారు’’ అని కోమటిరెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు సరికావు. సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలు కూడా సరికావు. రేవంత్‌రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏవీ ఫైనల్‌ కావు. పీసీసీ అధ్యక్షుడి పదవి చాలా చిన్న పోస్ట్‌. ఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్‌కు లేదన్న కోమటిరెడ్డి.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వొద్దు.. 3 గంటలు ఇస్తే చాలు: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘‘రేవంత్‌ వ్యాఖ్యలపై సీఎల్పీ నేతతో చర్చించాను. అవసరమైతే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తాం. అమెరికా వెళ్లిన రెండురోజుల్లో రేవంత్‌ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డిపై బాలకృష్ణ ప్రభావం పడిందా?’’ అంటూ కోమటిరెడ్డి వ్యంగంగా మాట్లాడారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)