Breaking News

అడవిలోనా.. బీచ్‌లోనా? 

Published on Sat, 02/25/2023 - 05:10

సాక్షి, అమరావతి: ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. నీ ప్రతిపక్ష హోదాతోపాటు జడ్‌ కేటగిరీ సెక్యూరిటీ కూడా వదులుకో.. నేనూ, వంశీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం. నల్లమల అడవికో, బందరు బీచ్‌కో వెళ్లి కొట్టుకుందాం..’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) ప్రతి సవాల్‌ విసిరారు.

‘మన పోరాటంలో మేం చచ్చిపోతే నిన్ను జైల్లో పెడతారు.. నువ్వు చస్తే మమ్మల్ని జైల్లో వేస్తారు. ఈ రాష్ట్రానికి పట్టిన నీ దరిద్రం పోతుంది’ అని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 

► రెండు గ్లాసులు, ఒక కంప్యూటర్‌ పగిలిన కార్యక్రమాన్ని చూసేందుకు గన్నవరం వెళ్లిన చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. ఆయన అరుపులు విని పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చారని గన్నవరం ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలి. లేదంటే రామ్మూర్తినాయుడిని కట్టేసినట్లుగా చంద్రబాబును కుటుంబ సభ్యులే బంధించాలి.  

​​​​​​​► బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ లోకేశ్‌.. పిల్లోడు, రాజకీయాలు తెలియనోడు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నాడని జనం అనుకుంటారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటే లోకేశ్‌ ఆయన్ను కొరికి ఉంటారేమోననే  అనుమానం కలుగుతోంది. దీర్ఘాలు తీస్తూ సినిమా డైలాగులు చెబుతున్న చంద్రబాబు ఖాళీగా ఉండలేక అఖండ,  వీరసింహారెడ్డి సినిమాలు ఏమైనా చూశారా? ఆయన పిచ్చి మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుని చివరకు జైలు పాలవుతున్నారు. 

​​​​​​​► ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్‌ అని ఎద్దేవా చేస్తున్న చంద్రబాబు మూగ జీవాల  పాల ఉత్పత్తులతో వ్యాపారం చేసి కోట్లు కూడబెడుతుండటం నిజం కాదా? ఆయన దిక్కుమాలిన రాజకీయం నాకు, వంశీకి చాలా బాగా తెలుసు. మాతో పెట్టుకోవద్దు. పట్టాభిని గన్నవరం పంపిందే చంద్రబాబు. అక్కడ ఏ పార్టీ వారికీ గాయాలు కాలేదు. ఘర్షణ కట్టడి చేయడానికి వెళ్లిన పోలీసులకు మాత్రమే గాయాలయ్యాయి. టీడీపీ మూకల దాడిలో సీఐ తల పగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు పోలీసుల తాట తీస్తానంటూ బెదిరిస్తున్నారు. సీఐ, డీజీపీ క్రిస్టియన్‌ అంటూ మతాల పేరిట రెచ్చగొట్టే యత్నాలను ప్రజలు గమనించాలి. 

అందుకు టెలిఫోన్‌ ఆపరేటర్‌ చాలు.. 
గూగుల్‌ టేకవుట్‌ ఏమిటి? ఒక లొకేషన్‌ నుంచి ఎంతమంది ఫోన్లలో మాట్లాడారో చెప్పేందుకు సీబీఐ ఎందుకు? ఒక టెలిఫోన్‌ ఆపరేటర్‌కు అప్పగిస్తే ఎప్పుడో తేల్చేసే వారు. ఎవరి ఫోన్‌ ఎవరికి వెళ్లిందో చెప్పేదాన్ని సీబీఐ ఎంక్వైరీ అనరు. దాన్ని టీవోఐ (టెలిఫోన్‌ ఆపరేటర్‌ ఎంక్వైరీ) అని నేను భావిస్తున్నా.   

Videos

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)