Breaking News

బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు?

Published on Sat, 07/06/2024 - 05:56

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఎటూ తేలలేదు. దీంతో పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. కేంద్ర కేబినెట్‌ ఏర్పాటు, తదనంతర పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో ఆయన అటు మంత్రిగా పార్లమెంట్‌ సమావేశాలు, కశ్మీర్‌ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్‌ ఎన్నికలు వచ్చే సెపె్టంబర్‌ నెలాఖరులోగా జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి దాకా అధ్యక్షుడి గా ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అ యితే ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దా    నిపై బీజేపీ కేంద్రం నాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. దీంతో ఈ అంశం కొంతకాలం పాటు పెండింగ్‌లో పడినట్టుగానే భావించాల్సి ఉంటుందని పారీ్టవర్గాలు పేర్కొంటున్నా యి. రాష్ట్రంలో అడపాదడపా యువమోర్చా, మహిళా మోర్చా ల వంటి విభాగాలు ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేపడుతున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

అ«ధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీపడుతున్నా, చివరకు ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. పారీ్టలో ఉన్న ఇప్పటికే ఉన్న కొందరు ముఖ్యనేతలు, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పవర్‌సెంటర్లుగా మారడం వంటి కారణాలతో పారీ్టనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తోందని పారీ్టనాయకులు భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసి, ఆయన్ను కూడా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నందున, కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

కొనసాగుతున్న ఉత్కంఠ  
కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్‌ ధర్మపురి, ఎం.రఘునందన్‌రావు గట్టిగా పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రమంత్రిగా, బీజేఎలీ్పనేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచి్చనందున, బీసీ వర్గాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈటల పేరు దాదాపుగా ఖరారై ప్రకటించాల్సిన దశలో మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పారీ్టపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎ¯న్‌.రామచంద్రరావు, టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో రాష్ట్ర పారీ్టలోనూ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం క్రితమే పారీ్టలో చేరిన వారికి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు 1951లో జనసంఘ్‌ కాలం, 1980లో బీజేపీగా ఏర్పడ్డాక ఇప్పటిదాకా రెండేళ్ల పాటు మాత్రమే బంగారు లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. ఇదీగాకుండా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దళిత సామాజికవర్గాల ఆదరణను పొందలేకపోయినందున ఈసారి ఓ సీనియర్‌ ఎస్సీ నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఈ వర్గాల్లోనూ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని ఓ వర్గం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)