Breaking News

రైతులకు కాంగ్రెస్‌ దగా!

Published on Thu, 08/01/2024 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభిస్తున్నట్టు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

‘‘రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు దగా చేస్తోంది. రైతులకు ఏ ప్రతిపాదికన రుణమాఫీ చేస్తున్నారన్న అంశాన్ని స్పష్టం చేయాలి. చాలా మంది రైతులు రుణమాఫీ జరగక బ్యాంకుల్లో డీఫాల్టర్‌గా మారే దుస్థితి ఏర్పడింది’’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలిచి్చ, అధికారంలోకి వచ్చాక దగా చేయడంలో అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ఆరోపించారు. 

రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.. 
గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తామని.. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికిపైగా బడ్జెట్‌ కేటాయిస్తే.. అది తెలంగాణలో 7.60 శాతమేనన్నారు. 

మాటలు కోటలు దాటినా.. 
కాంగ్రెస్‌ నాయకుల మాటలు కోటలు దా టుతున్నా.. చేతలు సెక్రటేరియట్‌ దాటడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పంటలకు మద్దతు ధర పెంపు, నిరుద్యోగులకు జాబ్‌ కేలండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మ   ద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోందే తప్ప.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.

ఇదీ బీజేపీ హెల్ప్‌లైన్‌ నంబర్‌
రుణమాఫీకాని రైతులకు అండగా నిలిచేలా, ‘రైతుల పక్షాన కాంగ్రెస్‌ సర్కారును ప్రశి్నస్తున్న తెలంగాణ’ పేరుతో బీజేపీ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8886 100 097ను ప్రారంభించారు. కాగా.. ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)