Breaking News

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం

Published on Sun, 05/26/2024 - 13:06

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్‌ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా  కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు.  

‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు  యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని  ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. 

అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో  మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా  చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు.  

ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రధాని మోదీ చిన్న  సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ  ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. 

ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్‌  ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్‌ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏడో విడతలో జూన్ 1  నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు జూన్‌ 4న విడదల కానున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)