Breaking News

TS Election 2023: పినపాక ఎమ్మెల్యేపై ఓటర్ల అసంతృప్తి..!

Published on Tue, 08/29/2023 - 19:23

భద్రాద్రి: పినపాక నియోజక వర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసేది డబ్బు, కమ్మ కులం, రెడ్డి కులం. నియోజకవర్గంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నపటికీ నిరుద్యోగ యువతకు ఐటీసీ, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నా స్థానిక నిరుద్యోగ యువతకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదని, ఈ నియోజకవర్గం దాదాపుగా 80 శాతం గోదావరి పరివాహక ప్రాంతం కావటం ప్రతి సంవత్సరం సుమారు 60 గ్రామాల వరకు నీట మునిగి పోతాయి.

ఇండ్లు, పంట పొలాలు, రోడ్లు, పూర్తిగా జలమయమై పోతాయి. ఎన్నో సంత్సరాల నుంచి ఎంతో మంది అధికారులకు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు మొరపెట్టిన వారిని మైదాన ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని వేడుకున్న వాళ్ల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. వెరసి యువత, గోదావరీ పరివాహక ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ప్రజలతో..
రేగ కాంతారావు ఈ నియోజవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవటం, ఇసుక ర్యాంపులలో కమిషన్లు, అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు, ఇక ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. గతంలో సీపీఐ పార్టీలో పనిచేయడం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్తతో నేరుగా సంబంధాలు ఉండటం.. అయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెత్తనం మొత్తం అయన భార్యదే.

ఎమ్మెల్యే నామ్కే వాస్తు అనే అప నింద నేటి వరకు అయన మోయటం, సీపీఐ పార్టీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చేరటం, పొంగులేటికి చెప్పకుండా ఏ పని చేయడు అని ప్రజలో బలంగా వినిపిస్తున్న మాట. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పది మంది వరకు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపకపోవటం, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నపటికీ ఇక్కడ సుమారు 50 వేల వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉందని చెప్పవచ్చు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)