Breaking News

హాట్రిక్‌పై పువ్వాడ కన్ను.. ఖమ్మంలో రసవత్తర పోటీ!

Published on Tue, 08/29/2023 - 15:17

ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హట్‌టాపిక్‌గా మారనుంది. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సాన బేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి పార్టీలు. 

2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా. 2004లో సిపిఏం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి  గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా ఆ తర్వాత టీఆర్ఏస్‌లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. 

నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశం : 

ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరోవైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీసెంటర్ కాల్వడ్డు వంటి ప్రాంతాలను వర్షపు నీరు  ముంచేత్తుతుంది. కాలనీలు చెరువులను తలపించే పరిస్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతు వస్తున్నారు...ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు కోరుతున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్లేదు. దీంతో  3 టౌన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సరైన లబ్ధిదారులకు అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి.. స్థానికంగా కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.. అంతేకాదు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న టాక్ సైతం లోకల్ గా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు అన్న ప్రచారం సైతం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చుపించుకున్నారనే చెప్పాలి. 

ఖమ్మం టౌన్‌తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22కోట్ల రూపాయలతో లకారం ట్యాంక్ బండ్, 8కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు..తీగల వంతెన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 21కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, 25కోట్ల రూపాయలతో ఐటీ హబ్, 110 కోట్ల రూపాయలతో గొల్లపాడు ఛానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు. నూతన కార్పొరేషన్ భవనాన్ని ర్మించారు. దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు :

ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం మూడు లక్షల పదకొండు వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సమాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఏక్కువగా ఉంటాయి. సిపిఏం, సిపిఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గం లో బలంగా ఉన్నాయి..అయితే వచ్చే ఎన్నికల్లో బీఅరెఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలో ఏవరితో పోత్తు పెట్టుకుంటారన్నది ఇంకా క్లారిటీ లేదు..వీరు ఏటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి కొంత కమ్యూనిస్ట్ ల ఓట్లు ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..

ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఖమ్మం సీటుపై కీలక నేతలు గురిపెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన పోటీ నెలకోనే అవకాశం ఉంది. ఇప్పిటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. మంత్రి పువ్వాడ అజయ్‌కే మరోసారి టికెట్‌ కట్టబెట్టింది. దాంతో ఆయన హ్యాట్రిక్‌ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు. ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన డికొనడానికి కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.

కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు పొంగులేటి. పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నారు. ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నారట. అటు జావిద్ కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద టికెట్ ఆశిస్తున్నారు.

వృత్తిపరంగా ఓటర్లు :

పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఏక్కువగా ఉంటారు. రఘనాథపాలెం మండలంలో రైతులు ఏక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతు ఉంటారు.కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి.

మతం/కులం పరంగా ఓటర్లు :

యాదవులు 45 వేల ఓట్లు, కమ్మ 48వేల ఓట్లు, మైనార్టీ ఓట్లు 30వేలు ఉంటాయి. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు విరివే.

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :

ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది.ఖమ్మం నగరంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు.ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు.పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్,చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది.ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)