నారా లోకేష్‌ పనికిమాలిన వ్యక్తి: కేశినేని నాని ఫైర్‌

Published on Thu, 02/01/2024 - 13:40

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు కేశినేని నాని. నారా లోకేష్‌ పనికిమాలిన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా  చంద్రబాబు పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేశినేని నాని గురువారం నాలుగో విడత వైఎస్సార్‌ ఆసరా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి. సీఎం జగన్‌ విజయవాడ నగరంలోనే రూ.325కోట్లు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిన చూపించిన నాయకుడు సీఎం జగన్‌. 

అదే చంద్రబాబు.. అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్‌లా చదువుకోవాలని కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. కానీ, చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి. పనికిమాలిన వ్యక్తిని, తన కొడుకు నారా లోకేష్‌ను మంత్రిని చేశాడు. మీడియా మేనేజ్మెంట్ చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశాడు 

చంద్రబాబుకు ఇప్పటికీ ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా  చంద్రబాబు పనిచేస్తున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నేను ఉంటేనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచాడు. నేను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో. 25వేల మెజారిటీతో అవినాష్ గెలవబోతున్నాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)